హీరో మహేశ్ బాబు ఇంట వినాయక నిమజ్జనం పూర్తి!

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 04:51 PM

తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా ఈ హీరో కుటుంబంలో వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా మహేశ్ ఇంట వినాయక చవితి పండుగ జరుపుకున్నారు.  
ఈ సారి పర్యావరణ హిత మట్టి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకున్న ఈ కుటుంబం..విగ్రహాన్ని తొట్టి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్, నమ్రత దంపతులతోపాటు సితార, గౌతమ్ కూడా పాల్గొన్నారు.

నిమజ్జనం చేయడానికి ముందు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మహేశ్ ఫ్యామిలీ.. అనంతరం తొట్టి నిమజ్జనం చేశారు. ‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నా’ అంటూ నమ్రత గణేశ నిమజ్జనం వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recent Post