ముగిసిన నటి ముమైత్‌ఖాన్‌ ఈడీ విచారణ

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 06:40 PM

టాలీవుడ్‌ సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటి ముమైత్‌ఖాన్‌ ఈడీ విచారణ ముగిసింది. ఆరు గంటల పాటు ముమైత్‌ఖాన్‌ను ఈడీ విచారించింది. బ్యాంక్‌ లావాదేవీలు, కెల్విన్‌తో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. ఆదేశిస్తే మరోసారి విచారణకు రావాలని ముమైత్‌కు ఈడీ అధికారులు చెప్పారు. ఈ కేసులో సినీరంగానికి చెందిన 12మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు చార్మీ, రకుల్ ప్రీతి సింగ్, హీరో రవితేజ, నందు, రానా, నవదీప్‌లను ఈడీ విచారించింది. తనీష్‌ 17న, తరుణ్‌ 22న విచారణకు హాజరుకానున్నారు.
Recent Post