రకుల్ 'కండోమ్ టెస్టర్' మూవీ ఆగిపోయినట్టేనా?

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 10:01 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఒక దశలో వరుస క్రేజీ స్టార్ ల చిత్రాల్లో నటించి పలువురిని ఆశ్చర్యానికి గురి చేసిన రకుల్ ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ బిజీ నాయికగా మారింది. తెలుగులో క్రిష్ తెరకెక్కించిన `కొండ పొలం` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా వుంది. కొండ పొలం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. వచ్చే నెల ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఇదిలా వుంటే హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ షాకిస్తోంది రకుల్. అంతే కాకుండా తెలుగుతో పోలిస్తే ప్రయోగాత్మక చిత్రాలకు సై అంటోంది. ఇదే జోష్ తో ఓ కాంట్రవర్షియల్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అదే `ఛత్రవాలి`. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రలో నటించడానికి అంగీకరించడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ఈ తరహా బోల్డ్ పాత్రని రకుల్ ఎందుకు ఒప్పుకుందని ఎలా నటిస్తుందోనని ఆమె అభిమానులు షాక్ అయ్యారు.


ఈ మూవీ ప్రకటించిన తరువాత సోషల్ మీడియాలో రకుల్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయితే తాజా సమాచారం ఏంటంటే ఈ కాంట్రవర్షియల్ మూవీ ఆగిపోయిందని తెలుస్తోంది. నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ మూవీ నుంచి తప్పుకున్నారని ఆ కారణంగానే ఈ మూవీ ఆగిపోయిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ నిర్మించినా రిలీజ్ సమయంలో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం వుందని నిర్మాత భావించడం వల్లే ఈ మూవీ ఆగిపోయిందని చెబుతున్నారు. అయితే రకుల్ మాత్రం వరుస చిత్రాలతో బిజీగా వుంది. తమిళంలో శివ కార్తికేయన్ తో `అలయాన్`.. కమల్ హాసన్- ఇండియన్ 2 లో నటిస్తోంది. హిందీలో `ఎటాక్ రిలీజ్ కి రావాల్సి ఉంది. అక్టోబర్ 31 లేడీస్ నైట్- మే డే- థ్యాంక్ గాడ్- డాక్టర్ జీ చిత్రాలు చిత్రీకరణ దశలో వున్నాయి.
Recent Post