'బన్నీ' పై హీరోయిన్ 'హన్సిక' ప్రశంసల జల్లు

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 10:36 PM

వయసు మీద పడుతున్నా చాలా మంది క్రేజీ హీరోయిన్ లు పెళ్లి మాట ఎత్తడం లేదు. ఈ జాబితాలో హన్సిక కూడా చేరింది. తమిళ స్టార్ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమాయణం సాగించినా ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో బ్రేకప్ చెప్పేసి కెరీర్ పై దృష్టి పెట్టింది. అయినా ఫలితం లేకుండా పోయింది.  `కోయీ మిల్ గయా` హిందీ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ పాల బుగ్గల సోయగం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `దేశ ముదురు` చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


తొలి చిత్రంతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆ వెంటనే హిందీలో `ఆప్ కా సురూర్` మళ్లీ తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమా.. ఇలా అటూ ఇటూ అంటూ తెలుగు- హిందీ- తమిళ- కన్నడ భాషల్లో ఎడా పెడా సినిమాలు చేసింది. కానీ తమిళ్ ఇండస్ట్రీలో సెట్టయిపోయింది. అయితే అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయింది. కొంత కాలం ప్రేమాయణం కారణంగా కెరీర్ గాడి తప్పడంతో ఇప్పుడు మహిళా ప్రధాన థ్రిల్లర్ చిత్రాల్లో నటిస్తూ బండిని లాగించేస్తోంది.


`మహా` పేరుతో ఓ థ్రిల్లర్ డ్రామాలో నటించింది. ఇందులో మాజీ ప్రియుడు శింబు గెస్ట్ రోల్ లో నటించడంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా వుంటే  హన్సిక ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో తన అనుచరులతో చేసిన చిట్ చాట్ లో హన్సికను తన తొలి చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ గురించి చెప్పమని ఒక అభిమాని అడిగాడు. ``మధురమైన.. దయగల.. సరదా గల వాడు.. నా మొదటి సహనటుడు!`` అని హన్సిక సమాధానమిచ్చింది. ఆపిల్ బ్యూటీ బన్నీని వర్ణించిన తీరుకు ఆ అభిమాని ఫిదా అయిపోయాడు. అల్లు అర్జున్ తన ఇన్ స్టా కథనాలను ఎంచుకుని హన్సికకు కృతజ్ఞతలు తెలిపాడు.. ధన్యవాదాలు స్వీటీ.. అంటూ ఉప్పొంగిపోయాడు. అయితే ఇప్పుడు హన్సిక ఉన్న స్టాటస్ లో తనకు బన్నీ లాంటి పెద్ద స్టార్ తో తెలుగులో కంబ్యాక్ అవసరం. మరి బన్నీ ఛాన్సిస్తున్నారా? అన్నది చూడాలి.


ఇటీవల హన్సిక ఏమైపోయింది? చడీచప్పుడు లేనే లేదు? అసలు నటిస్తోందా లేదా? అంటూ కొందరు సందేహం వ్యక్తం చేశారు. శింబుతో ప్రేమాయణానికి బ్రేక్ పడిపోయాక కెరీర్ పరంగా ఎందుకనో స్లో అయ్యింది. కానీ ఇంతలోనే తిరిగి కెరీర్ ని ట్రాక్ లో వేయాలని గట్టి ప్లాన్ వేసింది.. ఇప్పుడు బన్ని ఏదైనా ఆఫరిస్తాడా? అంటూ హోప్ తో ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!
Recent Post