సంక్రాంతి రేస్ లో 'ఆర్ఆర్ఆర్'....!

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 12:19 PM

 దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఆల్రెడీ అన్ని భాషల్లో కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం అధికారికంగా ఈ వచ్చే అక్టోబర్ రేస్ నుంచి తప్పుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూటింగ్స్ కూడా అన్నీ కంప్లీట్ అయ్యిపోయాయట. అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. వచ్చే రెండు నెలలోపే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ కాపీ ని రెడీ చేసేసి జనవరి సంక్రాంతి రేస్ నే టార్గెట్ పెట్టుకొని రిలీజ్ చెయ్యాలని సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా కోసం మాత్రం వీక్షకులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పరిస్థితులు సహకరిస్తే ఇంకా బాగుంది.
Recent Post