బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 : వైల్డ్ కార్డ్ ఎంట్రీగా యాంకర్ వర్షిణి రానుందా ?

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 12:25 PM

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ తెలుగు రియాల్టీ షో 'బిగ్‌ బాస్‌' సీజన్‌ 5 లో ఆదివారం తొలి ఎలిమినేషన్‌ జరిగింది. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా యూట్యూబ్ స్టార్ సరయు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది.. ప్ర‌స్తుతం హౌజ్ లో 18 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మరొక కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని సమాచారం. ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాలుగో వారంలో ఉంటుంది. అయితే ఈ సీజన్ లో రెండవ వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలిసింది. టీవీ యాంకర్ వర్షిణి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ వారం హౌజ్ నుండి ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు.
Recent Post