సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదల వాయిదా పడనుందా?

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 12:38 PM

దేవ కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరో హీరోయిన్‌లుగా  తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’.  ఈ చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అయితే ఇటీవల సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంత తక్కువ వ్యవధిలో సాయితేజ్ కోలుకుని ప్రమోషన్స్‌లో పాల్గొనడం కష్టమేనని, దీంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరీ ఈ సినిమాను అనుకున్న తేదికే విడుదల చేస్తారా లేక నిజంగానే వాయిదా వేస్తారా అనే దానిపై త్వరలోనే అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Recent Post