ఈ రోజే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న“మాస్ట్రో”...!

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 01:02 PM

నితిన్ హీరోగా, నబ్బా నటేష్ మరియు తమన్నా భాటియా లు హీరోయిన్ లుగా వస్తున్న చిత్రం మాస్ట్రో.  ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్దం అవుతుంది. నేడు రాత్రి నుండి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో కి రానుంది. ఈ చిత్రం నేడు రాత్రి 12:00 గంటల నుండి ప్రసారం కానుంది. అంధధున్ చిత్రం కి ఇది రీమేక్ కావడం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో డార్క్ హ్యూమర్ నచ్చడం తో కొన్ని మార్పులు చేసి, ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకులు ఇప్పటికే తెలిపారు. ఈ చిత్రం క్లైమాక్స్, ఎలా ఉండనుంది, లవ్ ట్రాక్ మరియు నితిన్ పెర్ఫార్మెన్స్ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
Recent Post