ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ!

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 16, 2021, 06:10 PM



కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో చేసిన `అల్లుడు అదుర్స్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ దృష్టి `ఛత్రపతి` రీమేక్ వైపు మళ్లింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన చిత్రం `ఛత్రపతి`. 2005లో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లో మాసీవ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రాన్నిబీటౌన్ లో జయంతిలాల్ గడ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.


మాస్ చిత్రాల దర్శకుడు వి. వి. వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇదే మూవీతో వివి వినాయక్ బి-టౌన్ లోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా సెట్  దెబ్బతినడంతో షూటింగ్ ని చిత్ర బృందం తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది. ఇందులో బెల్లంకొండ సశ్రీనివాస్ కు జోడీగా బాలీవుడ్ హాటీని హీరోయిన్ గా చిత్ర బృందం ఫైనల్ చేసినట్టుగా చెబుతున్నారు.  


ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ హాటీ నుష్రత్ బరుచాను ఎంపిక చేశారు. ఈ డ్రీమ్ గర్ల్ పై రెండు రోజుల పాటు చిత్రీకరణ జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఈ వార్తలను అత్యంత రహస్యంగా ఉంచారు. తాజా నివేదికల ప్రకారం `ప్యార్ కా పంచనామా 2`.. `సోను కే టిటు కి స్వీటీ`లో  నుస్రత్ బరుచా నటనను చూసిన తర్వాత వినాయక్ నుష్రత్ ని ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నాడట. బెల్లంకొండ.. నుష్రత్ ఇద్దరి మధ్య తెరపై మంచి కెమిస్ట్రీ పండుతుందని  వినాయక్ భావించినట్లు తెలుస్తోంది.


వినాయక్ ఇచ్చిన ఈ ఆఫర్ ఆమెకు వచ్చడంతో నుష్రత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. నుష్రత్ 2010 లో విడుదలైన `తాజ్ మహల్` చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆమె ఎంట్రీని ఎవరూ గుర్తించలేదు. ఇదిలా వుంటే `ఛత్రపతి` రీమేక్  షూటింగ్ ఈ ఏడాది జూలైలో ప్రారంభమైంది. మేకర్స్ హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను ఏర్పాటు చేసారు. సినిమాలో ప్రధాన భాగాన్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com