భర్త 'రాజ్ కుంద్రా' పై 'శిల్పాశెట్టి' సంచలన వ్యాఖ్యలు

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 06:37 PM

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో శిల్పాశెట్టిని ముంబై పోలీసులు సాక్షిగా చేర్చారు. ఈ నేపథ్యంలో తన భర్త ఏం చేస్తుండేవాడో తనకు తెలియదని పోలీసులకు శిల్పాశెట్టి తెలిపింది.


 తాను షూటింగుల్లో బిజీగా ఉండేదాన్నని... అందువల్ల తన భర్త ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్స్ ల గురించి కూడా తనకు తెలియదని తెలిపారు. ఈ కేసులో మొత్తం 1400 పేజీల చార్జ్ షీట్ ను పోలీసులు ఫైల్ చేశారు. శిల్పాశెట్టి స్టేట్మెంట్ ను కూడా ఈ చార్జ్ షీట్ లో పొందుపరిచారు. జులై 19 నుంచి రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది.  
Recent Post