సాయి ధరమ్‌ తేజ్‌ను పరామర్శించిన బన్నీ

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 07:00 PM

 మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డా. అలోక్‌ రంజన్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఎప్పటికప్పుడు తేజ్‌ ఆరోగ్య పరిస్థితిని క్లోజ్‌గా మానీటరింగ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా గురువారం అల్లు అర్జున్‌ అపోలో ఆసుపత్రికి చేరుకొని సాయ్‌తేజ్‌ను పరామర్శించారు. తేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


ప్రమాదం అనంతరం చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సహా మెగా కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు అపోలో ఆసుపత్రికి వచ్చి తేజ్‌ను పరామర్శించారు. అయితే ఆ సమయంలో బన్నీ 'పుష్ప' షూటింగ్‌ నిమిత్తం కాకినాడ వెళ్లడంతో అప్పుడు రాలేకపోయారు. గురువారం షూటింగ్‌ అనంతరం హైదరాబాద్‌ వచ్చిన బన్నీ నేరుగా సాయి ధరమ్‌ తేజ్‌ను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
Recent Post