'చైతన్యతో సమంత డివోర్స్'.. మళ్లీ పెళ్లికూతురిగా అక్కినేని కోడలు!?

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 08:52 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ కూతురిగా దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి .. మళ్లీ సామ్ పెళ్లి చేసుకోబోతుందా..? అని షాక్ అవ్వకండి.. ఒక ఫొటోషూట్ కోసం సామ్ పెళ్లికూతురిగా మారింది. ప్రస్తుతం సామ్ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక నాగ చైతన్యతో విభేదాల గురించి కానీ, విడాకుల గురించి కానీ చెప్పకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటో షూట్స్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.


మొన్నటికి మొన్న బోల్డ్ లుక్ తో హాట్ పోజ్ లతో ఫొటోలు షేర్ చేసిన ఈ భామ తాజాగా తెలుగింటి పెళ్లి కూతురిగా కనిపించింది. మావూరి సిల్క్స్ పట్టుచీరలో ప్రీతమ్ జూకాల్కర్ నగలతో అచ్చతెలుగు వధువులా ముస్తాబైంది. ప్రస్తుతం ఈ ఫొటోలను సామ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా పలు కామెంట్లు కూడా పెడుతున్నారు. సమంత- నాగ చైతన్య పెళ్లిలో ఇలాగే ముస్తాబయ్యింది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ సామ్.. నువ్వు చైతో ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం అని కొందరు అంటుండగా, మరికొందరు చైతుతో విడిపోయారా..? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి తరువాత మరోసారి పెళ్లి కూతురిలా కనిపించి అక్కినేని కోడలు మెస్మరైజ్ చేస్తోందని అభిమానులు ఆనందపడుతున్నారు.
Recent Post