టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లైంగిక వేదింపులు పై నటి 'ఇంద్రజ' షాకింగ్ కామెంట్స్?

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 09:06 PM

సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రతి ఇండస్ట్రీలో ప్రతి చోట కూడా ఆడవారిపై లైంగిక వేదింపులు చాలా కామన్ విషయం అనేది కఠిన నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా ఈ విషయం మాత్రం నిజం. అన్ని రంగాల్లోనూ అందరు కాకున్నా కొందరు ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు.. వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నించే వారు చాలా మంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వారిని.. అవకాశాల కోసం ఎదురు చూసే వారిని ట్రాప్ చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అమ్మాయిలు ఇండస్ట్రీలో ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టార్స్ గా ఉన్న హీరోయిన్స్ కూడా ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ లేదా లైంగిక వేదింపులు ఎదుర్కొన్న వాళ్లే అవ్వడం విశేషం. అందులో కొందరు ఒప్పుంటే కొందరు మాత్రం మాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురు కాలేదు అంటారు. తాజాగా ఈ విషయమై సీనియర్ నటి ఇంద్రజ మాట్లాడారు.


ఈమద్య కాలంలో ఈమె బుల్లి తెరపై తెగ సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కు గెస్ట్ జడ్జ్ గా వచ్చిన ఇంద్రజ అందరి మనసులను దోచుకున్నారు. రోజా అవసరం లేదు ఇక ఎప్పటికి ఇంద్రజ కావాలంటూ కొందరు  సోషల్ మీడియా ద్వారా కోరుకున్నారు. అంతగా ఆమె ను జనాలు ఆధరించారు. ఆమెకు దక్కిన ఆధరణ నేపథ్యంలో ఆమెను శ్రీదేవి డ్రామా కంపెనీకి పర్మినెంట్ జడ్జ్ గా తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతి ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ లైంగిక వేదింపులు ఉంటాయని.. అయితే అమ్మాయిలు ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలవాలంటూ ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చారు.


ఇంకా ఇంద్రజ మాట్లాడుతూ.. అవకాశాల కోసం మనోభావాలను చంపుకుని పని చేయాల్సిన అవసరం లేదు. అలా చేయకుండా కూడా కష్టపడి అవకాశాలు సంపాదించుకోవచ్చు. వేదింపులు ఉన్నాయి అంటూ పారిపోకుండా.. వాటిని ఎదుర్కొని నిలవాల్సి ఉంటుంది. ఎక్కడ అయితే అవకాశం కోసం వెళ్లాలనుకుంటున్నారో అక్కడి మనుషుల గురించి ముందే తెలుసుకుని దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి.  అవకాశాలు ఇప్పిస్తాను అనగానే వ్యక్తిత్వం చంపుకుని వారు చెప్పిన పని చేయనక్కర్లేదు అంటూ ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ నాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు అని... నా వరకు నేను ప్రతి విషయంలో జాగ్రత్తగా క్లారిటీగా ఉంటూ వచ్చాను. నా వ్యక్తిత్వం కాపాడుకుంటూ వచ్చాను. నాకు కెరీర్ ఆరంభంలో ఎలాంటి చేదు అనుభవాలు తారసపడలేదు. నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత కూడా నన్ను ఏ ఒక్క ప్రముఖులు కూడా ఇబ్బంది పెట్టలేదంది.
Recent Post