నెటిజన్స్ కి టార్గెట్ గా మారిన సిరి మరియు శ్వేతలు.. అతి చేస్తున్నారంటూ కామెంట్స్

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 10:55 PM

బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో కంటెస్టెంట్స్ టాస్క్ ల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు జరిగే ఎపిసోడ్స్ గురించి సోషల్ మీడయాలో వేలాది ట్వీట్స్ పడుతూ ఉంటాయి. కొందరిపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై కొందరు స్పందిస్తూ ఉంటే మరి కొందరు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కంటెస్టెంట్స్ ఎవరైనా ఏదైనా తప్పు చేసినా లేదా మరే రకంగా అయినా అసమర్థత చూపించినా కూడా వారిని జనాలు సోషల్ మీడియాలో ఏకి పారేయడం చాలా సందర్బాల్లో చూశాం. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. ఈసారి కంటెస్టెంట్స్ మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. టాస్క్ అంటే మల్లయుద్దం మాదిరిగా మారిపోతున్నారు. కంటెస్టెంట్స్ పలువురు మరీ అగ్రెసివ్ అవుతున్నారు. అమ్మాయిలు కూడా అందుకు తక్కువేం కాదు అని గత రెండు మూడు ఎపిసోడ్స్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.


అమ్మాయిల్లో ముఖ్యంగా సిరి మరియు శ్వేతలు మరీ రెచ్చి పోతున్నారు. ఇద్దరు నువ్వా నేనా అంటూ ఇతరులతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం హౌజ్ లో జరుగుతున్న విషయాలను పరిశీలిస్తే సిరి అతి చేస్తుంది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్బాయిలతో ఫిజికల్ టాస్క్ ల విషయంలో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అందరి విషయంలో కూడా అది జరుగుతుంది. కాని సిరి మాత్రం పదే పదే అదే విషయాన్ని ఎక్స్ పోజ్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. తన టీ షర్ట్ లో ఉన్న పిల్లోస్ ను సన్నీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతడు తన టీ షర్ట్ లో చేయి పెట్టాడు అంటూ ఆమె పదే పదే అరిచింది. దాంతో సన్నీ పై మొదట విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాని సిరి పదే పదే ఆ విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించడంతో పాటు అన్ని సమయాల్లో కూడా అబ్బాయిలను అదే విషయమై టార్గెట్ చేస్తుండటంతో ఆమె చెప్పేది నిజమేనా అంటూ అనుమానాలు కలిగాయి.


సిరి కంటెంట్ కోసం అతి చేస్తుంది. ఆమె అమ్మాయి అనే కార్డ్ ను ప్రదర్శించేలా గేమ్ ఆడుతుంది అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ఆట ఏమాత్రం మంచి పద్దతి కాదు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి కెప్టెన్ అయిన సిరికి సొంతంగా ఆడే సత్తా లేదు అలాగే ఆమె మాటలతో దాడి చేస్తూ ఉందని.. ఇతరులు కొట్టకున్నా కొట్టారని.. తోయకున్నా తోశారంటూ ఆరోపిస్తూ ఉందంటూ కామెంట్స్ చేస్తూ వస్తోంది. బిగ్ బాస్ లో ఇలాంటి కంటెస్టెంట్స్ కు కొంత కాలం వరకు మాత్రమే మనుగడ ఉంటుందని గతంలో వెళ్లడయ్యింది. గత సీజన్ లలో తేజస్వి మరియు భానులు ఇలా నోరు పారేసుకుని ఆడేవారు. అందుకే వారు ఎక్కువ కాలం ఉంటారనుకున్నా కూడా వారు మాత్రం త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి బిగ్ బాస్ లో ఈసారి సిరి మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంకా కొందరు కూడా సిరికి పోటీగా ఉన్నారు. కాని వారిలో సిరి ఉంటుందని అంటున్నారు.
Recent Post