ఆదిపురుష్ కోసం అలా మారనున్న డార్లింగ్

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 09:44 AM

మిర్చి లాంటి కుర్రాడే… అని ఘాటైన పాటతో పొగిడించుకున్న ఆ మిర్చి లాంటి కుర్రాడు ఇప్పుడెక్కడ? బాహుబలి కోసం బరువెక్కినా… తర్వాత సాహో కోసం కాస్త సన్నబడ్డాడు ప్రభాస్… రాధేశ్యామ్ ఫస్ట్ షెడ్యూల్స్‌లో కూడా రొమాంటిక్ లుక్స్‌తో పాటు థిన్ ఫిజిక్‌తో టూ స్మార్ట్ అనిపించారు. ప్రభాస్ కథ మళ్ళీ షరామామూలే. ఆదిపురుష్ కోసం రిపీటెడ్ గా స్క్రీన్ టెస్ట్ చేసి… ప్రభాస్ ఫిజిక్ పట్ల పెదవి విరిచారట డైరెక్టర్ ఓం రౌత్. వెంటనే… వరల్డ్ క్లాస్ ఫిజిషియన్లతో ఆన్ లైన్ చాట్ పెట్టించి.. ఏం చేస్తే రీషేప్ కావొచ్చో క్లారిటీ తీసుకుని… యూకే ట్రిప్ కన్ఫర్మ్ చేశారు. మూడు వారాల పాటు రిగరస్ డైట్ తీసుకుని మునుపటి డార్లింగ్ లా ఇండియాకు రిటర్న్ అవుతారట ప్రభాస్. ఆ మధుర క్షణాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. కేవలం ఏడాదిన్నర గ్యాప్‌లో మూడు సినిమాల ఫస్ట్ లుక్స్ కోసం ఫిజిక్‌ని చకచకా మార్చేశారు మెగాస్టార్. చూడ్డానికి అసహ్యంగా వున్నావ్ అని జక్కన్న అనగానే… సన్నగా కరెంటు తీగలా మారారు జూనియర్ ఎన్టీఆర్. సింహాద్రికీ యమదొంగకీ ఎంత కాంట్రాస్ట్ ఉందో చూసి ఇప్పటికీ నోరెళ్లబెడతారు తారక్ ఫ్యాన్స్. మరి… మన డార్లింగ్‌కి మాత్రం ఎందుకు సాధ్యం కాదు? పైగా… ఇన్‌స్టంట్ బాడీ రీఫామేషన్ అనేది ఇవ్వాళా రేపూ చాలా ఈజీగా జరిగిపోతోంది.


 


రేపటిరోజున మిర్చిలాంటి కుర్రాడు లండన్ ఫ్లయిట్ దిగితే… ఆదిపురుషుడు-అందాల రాముడు గెటప్స్‌తో ఎలా ఉండబోతున్నారో చెబుతూ ఫ్యాన్ మేడ్ పిక్స్ ఇప్పుడే వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి… అందరికంటే అమితానందపడేవాళ్లలో ముందుంటారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తాను రాసిపెట్టుకున్న సైంటిఫిక్ ఫిక్షనల్ స్టోరీకి సూటయ్యే నిఖార్సయిన ప్రభాస్ ని చూసుకోవచ్చన్నది నాగీ ఆశ. ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ అక్టోబర్లోనే ప్రాజెక్టు-కె షూట్ లో జాయినవ్వాలి ప్రభాస్. కాస్త అటూఇటూ ఇయినా సరే… తాను ఊహించుకున్న అభినవ ఆజానుబాహుడిని… ఆదిపురుష్ డైరెక్టర్ ద్వారా దక్కించుకోబోతున్నారు. సో… ప్రభాస్-నాగీ ‘పాన్ వరల్డ్ మూవీ’కి ఒక హర్డిల్ తొలగినట్టేగా?
Recent Post