బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్‌గా విశ్వ..

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 12:14 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో రెండో వారం ఆట కొనసాగుతోంది. హౌజ్‌లో కంటెస్టెంట్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గొడవలు కూడా బాగానే పెట్టుకుంటున్నారు. సెప్టెంబ‌ర్ 16న ప్ర‌సార‌మైన ఎపిసోడ్‌ లో గ‌ద్ద టీమ్, న‌క్క టీమ్‌ ల‌కు బిగ్ బాస్ అగ్గిపుల్ల మ‌జాకా టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో గ‌ద్ద టీమ్ గెలిచి ఓ జెండా సాధించింది. మొత్తం టాస్క్ పూర్త‌య్యే స‌రికి గ‌ద్ద టీమ్ ద‌గ్గ‌ర ఎక్కువ జెండాలు ఉండ‌డంతో ఆ జట్టే గెలిచిన‌ట్టు బిగ్ బాస్ తెలిపారు. అయితే ఆ టీంలో న‌లుగురిని కెప్టెన్సీ పోటీ దారులుగా ఎన్నుకోవాల‌ని గ‌ద్ద టీమ్ కెప్టెన్ శ్రీరామ్ చంద్ర‌కు బిగ్ బాస్ చెప్పారు. ఆయ‌న విశ్వ, యానీ మాస్టర్‌, పింకీ, హమీదాలను కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించాడు. వీరికి బిగ్‌బాస్‌.. ‘కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో మిగిలిన కంటెస్టెంట్స్ తాము స‌పోర్ట్ చేస్తున్న వారి బీక‌ర్స్‌లో కొబ్బ‌రి కాయ కొట్టి ఆ నీళ్లు పోసి నింపాలి. ఎవ‌రిది ముందుగా నిండుతుందో వారే విజేత‌లు. ఈ క్ర‌మంలో విశ్వ ఆ టాస్క్ లో విన్ అయ్యి రెండో వారం కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. ఇక హౌస్‌లో శ్వేత, షణ్ముఖ్ ల బర్త్‌ డే లను సెలబ్రేట్‌ చేశారు. ఈ సందర్భంగా శ్వేత తండ్రి, షణ్ముఖ్ తల్లిదండ్రులు, అతని గర్ల్ ఫ్రెండ్ విషెస్‌ చెప్పిన వీడియోను బిగ్‌బాస్‌ ప్లే చేయడంతో వారు ఎమోషనల్‌ అయ్యారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ హౌస్ మేట్స్ కి చాక్లెట్లు పంపి సర్‌ప్రైజ్‌ చేశాడు. సింగిల్ బెడ్ కోసం లోబో, ఉమా స్కిట్స్ వేశారు. లోబోకి ఎక్కువ ఓట్లు రావడంతో అతడికే సింగిల్ బెడ్ దక్కింది. ఈ రోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తమ దృష్టిలో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు, వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పనున్నారు.
Recent Post