ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ రివ్యూ : “మాస్ట్రో”

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 12:33 PM



యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “మాస్ట్రో”. హిందీ బ్లాక్ బస్టర్ హిట్ ‘అంధ ధూన్’ కి రీమేక్ గ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మరి నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. 


కథ : ఇక కథలోకి వస్తే అరుణ్(నితిన్) ఒక అంధుడు కానీ పియానో ఇన్స్ట్రుమెంట్ వాయించడంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాడు. దానితోనే తన లైఫ్ ని రన్ చేసుకుంటూ వస్తాడు. మరి తన పియానో ప్రతిభ చూసి ఇంప్రెస్ అయ్యిన నరేష్ తన భార్య సిమ్రాన్(తమన్నా) కోసం స్పెషల్ గా వాయించమని ఆహ్వానం ఇస్తాడు. మరి ఈ క్రమంలో వారి ఇంటికి వెళ్లిన అరుణ్ ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరి ఈ మర్డర్ ఎవరు చేసారు? ఎవరు చేయబడ్డారు? అంధుడు అయినటువంటి అరుణ్ ఈ కేసు నుంచి బయట పడతాడా అన్నవి తెలియాలి అంటే హాట్ స్టార్ లో ఈ సినిమా చూడాల్సిందే.


ప్లస్ పాయింట్స్ : ఈ సినిమా రీమేక్ ని ఆల్ మోస్ట్ అందరికీ తెలుసు దానిని బట్టి ఒరిజినల్ కి దీనికి ఏమన్నా చేంజెస్ ఉంటాయా అని చూసే వారు ఉంటారు కొత్తగా చూసే వారు కూడా ఉంటారు. మరి ఈ రెండు వర్గాల వారిని కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. మెయిన్ పాయింట్ ని మేకర్స్ ఎక్కడా కూడా పక్క దారి పట్టించడం అనవసర సన్నివేశాలు పెట్టించడం వంటివి కనిపించకపోవడం బాగా అనిపిస్తుంది. అలాగే ఇవే ఒరిజినల్ కోసం తెలియని వారు చూసినా ఆకట్టుకుంటుంది. ఇక మెయిన్ లీడ్ నటుల్లో నితిన్, తమన్నా ల విషయానికి వస్తే వారి కెరీర్ లో ఇవి మంచి ఛాలెంజింగ్ రోల్స్, వాటని కూడా వారు అంతే అవుట్ స్టాండింగ్ గా చేసారని చెప్పాలి. మొదటగా నితిన్ విషయానికి వస్తే.. ఇటవల కాలంలో తన నుంచి వస్తున్న రోల్స్ కి ఇది చాలా భిన్నం. అంతే కాకుండా తనని తాను ప్రూవ్ చేసుకోడానికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పాలి. ఓ అంధుడిగా ఈ రోల్ ని చాలా బాగా రక్తి కట్టించాడు నితిన్. డెఫినెట్ గా తన కెరీర్ లో ఓ నటుడిగా ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుంది. ఇక తమన్నా విషయానికి వస్తే తాను ఈ నెగిటివ్ రోల్ ని ఒప్పుకోవడమే ఓ ప్లస్ పాయింట్ అయితే దానిని తన షేడ్స్ తో చూపించడం మరో ప్రధాన ఆకర్షణ.. ఇది వరకు చూసిన తమన్నా కంటే ఇందులో తన రోల్ మరింత ఆసక్తిగా కొత్తగా అనిపిస్తుంది. అలాగే తనకి నితిన్ కి మధ్య కొన్ని సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. ఇక వీరితో పాటుగా లిమిటెడ్ గా కనిపించే నభా నటేష్, నటుడు జిస్సు సేన్ గుప్తా లు తమ రోల్స్ కి జస్టిస్ చేశారు.


మైనస్ పాయింట్స్ : ఆల్రెడీ రీమేక్ అన్నాక ఒరిజినల్ ఫ్లేవర్ కి ఒకేలా దింపేసినా దానిని ఇంకా ఎంటర్టైనింగ్ గా మలచకపోయినా దీని కోసం తెలిసిన వారికి ఖచ్చితంగా అంత రుచించదు.. అలాంటివే ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. ఈ చిత్రంలో గ్రిప్పింగ్ నరేషన్ ని దర్శకుడు కొద్దిగా మిస్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా డ్రమాటిక్ సీన్స్ ని యాడ్ చేస్తే బాగుండు. అలాగే నితిన్ రోల్ ని కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. నితిన్ తన రోల్ కి బానే చేసాడు కానీ ఆ రోల్ చుట్టూతా సంఘటనలు ఇతర అంశాలు కూడా ఆసక్తిగా మలచి ఉంటే బాగుండు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అందుమూలాన నితిన్ రోల్ కాస్త బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే సినిమా ఓ టెన్స్ లో మంచి మూమెంట్ తో నడుస్తుంది అనే సమయంలో ఓ సాంగ్ వస్తుంది అసలు అది కంప్లీట్ గా సినిమాని ఆసక్తిగా చూసేవారి థ్రిల్ ని దెబ్బ తీసినట్టు అనిపిస్తుంది. దాన్నెందుకు పెట్టాలి అనుకున్నారో వారికే తెలియాలి. అంతే కాకుండా ఒరిజినల్ సినిమాకి మించి కూడా ఈ సినిమా ఉన్నట్టుగా అనుభూతిని ఆల్రెడీ చూసినవారికి అంతగా అనిపించకపోవచ్చు.


సాంకేతిక వర్గం : సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం ఖచ్చితంగా ఉన్నతంగా అనిపిస్తాయి.. సినిమా అంతా మంచి విజువల్స్ ఆ గోవా సెటప్ అంతా కూడా నీట్ గా ఉంటుంది. అలాగే మహతి సాగర్ మ్యూజిక్ ఓకే అని చెప్పొచ్చు. కానీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ విషయానికి వస్తే.. ఒరిజినల్ ని రీమేక్ చెయ్యడంతో తన వర్క్ బాగుందని చెప్పాలి. అక్కడక్కడా చిన్నపాటి సవరణలు తప్పితే తన నుంచి మంచి వర్క్ ని ఈ సినిమాకి చూపించాడు. కాకపోతే తన నరేషన్ లో ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఉంటే డెఫినెట్ గా మంచి అవుట్ పుట్ ఇచ్చి ఉండేవాడు.


తీర్పు : ఇక మొత్తంగా చూసుకుంటూనే ఈ “మాస్ట్రో”.. ఒరిజినల్ చూసిన వారిని ఓవరాల్ గా మెప్పిస్తుంది అలాగే కొత్తగా చూసేవారికి మాత్రం ఇంకా ఇంప్రెస్ చేస్తుంది. నితిన్, తమన్నా ల అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ లు మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే పలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఒరిజినల్ ని పెద్దగా దెబ్బ తీయకుండా ఉండే ఈ రీమేక్ ఈ వారాంతంలో ఎప్పుడు చూసిన డెఫినెట్ గా వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.


నటీనటులు: నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, దర్శకుడు: మేర్లపాక గాంధీ, నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీత దర్శకుడు: మహతి స్వరసాగర్‌, సినిమాటోగ్రఫీ: జె యువరాజ్‌, ఎడిటర్: ఎస్‌ఆర్‌ శేఖర్‌.
రేటింగ్ : 3/5. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com