టాప్ లో ట్రెండ్ అవుతోన్న “లవ్ స్టోరీ” ట్రైలర్

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 12:54 PM

శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ల‌వ్ స్టోరీ". ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా నిన్న ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.  ట్రైలర్‌లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు, వీడియో లు విడుదల అయి సినిమా పై ఆసక్తి రేపాయి. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ సైతం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ 7.5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో టాప్ లో కొనసాగుతుండటం విశేషం. ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ట్రైలర్ తోనే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Recent Post