బాలయ్య “అఖండ” నుంచి ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందో...!

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 03:44 PM

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం “అఖండ”. అయితే ప్రస్తుత బజ్ మాత్రం ఈ సినిమా వచ్చే అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ అవుతుంది అని వినిపిస్తుంది కానీ ఇంకా రిలీజ్ డేట్ పై మాత్రం ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. మరి దీనికి గల కారణం ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇది కుదుట పడే వరకు అఖండ రిలీజ్ డేట్ పై అధికారిక క్లారిటీ వచ్చేలా లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.
Recent Post