వరుసగా మూడోరోజూ సోనూసూద్ ఇంటిపై ఐటి దాడులు

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 04:18 PM

నటుడు సోనూసూద్ ఇల్లు, కార్యాలయంతో సహా ఆరు ప్రదేశాలలో ఆదాయపు పన్ను శాఖ దాడులు వరుసగా మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ రైడ్స్ లో సోనూ సూద్ వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన కేసులో పన్ను అవకతవకల గురించి ఐటీ శాఖకు తెలిసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సినిమాల కోసం సోను తీసుకున్న డబ్బులో కూడా అక్రమాలు ఉన్నట్లు తెలిసిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ లావాదేవీలే కాకుండా సోను ఛారిటీ ఫౌండేషన్ ఖాతాపై కూడా ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడులు ఈరోజుతో ముగియవచ్చని,ఆ తర్వాత విలేకరుల సమావేశం ద్వారా ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను అధికారులు అందరికీ తెలియచేసే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఐటీ బృందాలు సోను ఎకౌంట్ పుస్తకాలు, ఆదాయం, ఖర్చులు, ఆర్థిక రికార్డులను తనిఖీ చేస్తున్నాయి. గురువారం ఉదయం స్వల్ప విరామం తర్వాత, దర్యాప్తు బృందం సోనూ సూద్ కు చెందిన ముంబై, లక్నో ప్రదేశాలలో రికార్డులను నిరంతరం పరిశీలిస్తోంది.
Recent Post