'ఎన్టీఆర్'​ షోలో మెరవనున్న రాజమౌళి, కొరటాల శివ.. వైరల్ అవుతున్న ప్రోమో!

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 05:51 PM

ఇద్దరు దర్శక దిగ్గజాలు రాజమౌళి, కొరటాల శివ.. వారికి ఎదురుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అది త్వరలోనే సాధ్యం కాబోతోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు?’ దానిని నిజం చేయబోతోంది.


హోస్ట్ సీట్ లో ఎన్టీఆర్, హాట్ సీట్ లో రాజమౌళి, కొరటాల కూర్చుని గేమ్ ఆడబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు కూడా. ఈ నెల 20న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి, కొరటాల గేమ్ ఆడనున్నారు.


ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాలతో తన 30వ సినిమా చేసేందుకూ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో వారిద్దరూ షోకు వస్తుండడంతో.. ఆ రెండు సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలనేమైనా చెబుతారా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Recent Post