విడుదల అయిన 'మా' ఎన్నికల నోటిఫికేషన్.. రూల్స్ ఇవే!

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 06:20 PM

తెలుగు సినీ పరిశ్రమలో కాక పుట్టిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10న (ఆదివారం) పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ చెప్పారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్లు, 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ల ఎన్నిక కోసం ఎలెక్షన్ ను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.


ఈ ఎన్నికకు ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. వచ్చే నెల 2వ తేది సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 2వ తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. పోలింగ్ జరిగే అక్టోబర్ 10న సాయంత్రం 7 గంటలకు ఎన్నికల ఫలితాలను  వెల్లడిస్తారు.


'మా' ఎన్నికల రూల్స్ 


ఒక అభ్యర్థి ఒక పదవి కోసం మాత్రమే పోటీ చేయాలి.


గత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అయి ఉండి ... 50 శాతం కన్నా తక్కువ ఈసీ సమావేశాలకు హాజరు కాకపోతే పోటీ చేయడానికి అర్హత ఉండదు. 


20 శాఖల అసోసియేషన్లలో ఆఫీస్ బేరర్స్ గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయాలి. లేకపోతే వారు పోటీ చేసేందుకు వారు అర్హులు కారు.




Recent Post