డ్రగ్స్ కేసులో ముగిసిన తనీష్ 'ఈడీ' విచారణ.. కెల్విన్ తో పరిచయo పై ప్రశ్నల వర్షం

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 06:47 PM

టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ జరుపుతుండడం తెలిసిందే. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ ప్రముఖులను వరుసగా విచారిస్తున్న ఈడీ అధికారులు నేడు నటుడు తనీష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై తనీష్ ను 7 గంటల పాటు విచారించారు.


డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో పరిచయాలపైనా, ఎఫ్ క్లబ్ లో జరిగే ప్రత్యేక పార్టీల గురించి తనీష్ ను అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటిదాకా పూరీ జగన్నాథ్,  రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, నవదీప్, రానా, ముమైత్ ఖాన్ తదితరులను ప్రశ్నించింది. 
Recent Post