లహరి అర్థరాత్రి 'హగ్గు'లు కు కారణం ఏంటో తెలుసా?

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 09:20 PM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో మెల్ల మెల్లగా రొమాంటిక్ జర్నీలు మొదలు అవుతున్నాయి. లవ్ ట్రాక్ లు నడిపిన వారు.. రొమాంటిక్ గా ఉన్న వారు ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం జరిగింది. గత రెండు సీజన్ లను చూస్తే మొత్తం సీజన్ కూడా లవ్ ట్రాక్స్ వల్ల కొనసాగిన కంటెస్టెంట్స్ ఉన్నారు. రాహుల్ విజేతగా నిలవడానికి కారణం ఖచ్చితంగా పున్నుతో లవ్ ట్రాక్ అనడంలో సందేహం లేదు. ఇద్దరు కూడా ఇంట్లో తెగ కలిసి పోయారు. కాని బయటకు వెళ్లిన తర్వాత పెద్దగా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా రెండు మూడు లవ్ ట్రాక్ లు నడిపేందుకు గాను కంటెస్టెంట్స్ ను నిర్వాహకులు ఎంపిక చేయడం జరిగింది. సీజన్ ప్రారంభం అయ్యి రెండు వారాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు లవ్ ట్రాక్ మొదలు అవ్వలేదు అనుకుంటున్న వారికి ఒక మంచి ఫీల్ కలిగించేలా మెల్ల మెల్లగా లవ్ ట్రాక్ లు మొదలు అవుతున్నాయి.


తనకు సాధ్యం అయినంత వరకు హమీద లవ్ ట్రాక్ ను నడిపించేందుకు ప్రయత్నిస్తుంది. శ్రీరామ చంద్రతో పాటు షణ్ను మరియు ఇతర అబ్బాయిలతో హమీదా చాలా క్లోజ్ గా ఉంటుంది. ఎవరితో వీలు అయితే వారితో స్నేహంగా మాట్లాడుతూ ఉంది. ఇంట్లో వరకే రిలేషన్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా ఏదో ప్రత్యేకంగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో లవ్ ట్రాక్ లో పడాలని అనుకుంటున్నారు. లవ్ ట్రాక్స్ లో మరోటి తాజా ఎపిసోడ్ లో కనిపించింది. అదేంటీ అంటే లహరి మరియు మానస్ లు ఇద్దరు టైట్ హగ్గులు.. అర్థరాత్రి ముచ్చట్లు. మొదట మానస్ కు ప్రియాంక చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది. స్వయంగా వెళ్లి మానస్ కు రోజ్ కూడా ఇవ్వడం జరిగింది. మానస్ ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లే ఉండి ఇప్పుడు లహరితో కూడా క్లోజ్ అయ్యాడు.


అర్థరాత్రి సమయంలో మానస్ ఇంట్లో వారు పడుకున్న సమయంలో గిన్నెలు కడిగే పని పెట్టుకున్నాడు. దాంతో ఒంటరిగా ఉన్న మానస్ వద్దకు లహరి వెళ్లింది. ఆ సమయంలో లహరితో మాటలు కలిపాడు. నీకు బ్లాక్ అంటే ఇష్టమా అంటూ అడిగాడు. అప్పుడు నాకు బ్లాక్ ఇష్టం.. ఆ తర్వాత బ్లూ ఇంకా వైట్ అంటే కూడా ఇష్టం అంటుంది. అప్పుడే మానస్ నాకు బ్లూ అంటే ఇష్టం అంటూ కాస్త దగ్గర అయ్యేలా మాటలు కలిపాడు. వీరిద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటున్న సమయంలో బెడ్ రూమ్ నుండి వీరిని శ్రీరామ చంద్ర మరియు సిరి ఇంకా కొందరు గమనించారు. ఆ సమయంలోనే శ్రీరామ చంద్ర కిచెన్ లోకి వెళ్లాడు.


రాత్రి సమయంలో ఒక్కరే వర్క్ చేయాలంటే చాలా ఇబ్బంది గా ఉంటుంది కదా.. అందుకే నేను వచ్చాను. ఇక్కడ ఎవరు ఉన్నా కూడా వచ్చేదాన్ని అంటూ లహరి చెప్పింది. ఆ తర్వాత మానస్ ను తన బెడ్ వరకు రావాల్సిందిగా లహరి ముద్దుగా పిలవడంతో అక్కడకు మానస్ వెళ్లాడు. ఆ తర్వాత తన మైక్ ను పక్కన పెట్టి లహరి చాలా టైట్ గా మానస్ కు హగ్ ఇచ్చింది. మానస్ కూడా లహరి హగ్ ను ఫీల్ అయ్యాడు అనిపించింది. మొత్తానికి అర్థరాత్రి హగ్గులతో వీరు మెల్లగా దగ్గర అవుతున్నారేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Recent Post