బన్నీ 'ఫుష్ప' సెట్ లో వార్నింగ్ బోర్డ్స్!

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 09:42 PM

స్మార్ట్ ఫోన్ ల టైమ్ మొదలు అయిన తర్వాత సినిమాల్లో హీరోల లుక్స్ ను రహస్యంగా ఉంచేందుకు దర్శక నిర్మాతలకు చాలా కష్టం అవుతోంది. ఔట్ డోర్ లో షూటింగ్ చేస్తున్నా.. ఇన్ డోర్ లో షూటింగ్ చేస్తున్నా కూడా ఎవరో ఒకరు కెమెరాతో క్లిక్ అనిపించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నెట్టింట ఆ ఫొటోలు మరియు వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి. కొన్ని సార్లు ఎడిటింగ్ రూమ్ నుండి.. కొన్ని సార్లు వీఎఫ్ఎక్స్ స్టూడియో నుండి కూడా షాట్స్ లీక్ అవుతున్నాయి. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఆర్ ఆర్ ఆర్ నుండి ఎప్పుడూ ఏదో ఒక లీక్ వస్తుంది. ఆయన చిత్ర యూనిట్ సభ్యులను హెచ్చరించి మరీ లీక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పుష్పకు ఇప్పుడు లీక్ సమస్య తప్పడం లేదు.


పుష్ప సినిమా ఔట్ డోర్ షూటింగ్ నడుస్తోంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో.. అటవి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్న నేపథ్యంలో స్థానికులు షూటింగ్ చూసే ఉద్దేశ్యంతో వచ్చి అక్కడ అల్లు అర్జున్ ఫొటోలను మరియు వీడియోలను తీస్తున్నారు. ఇప్పటికే బన్నీకి సంబంధించిన పలు ఫొటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు కాకినాడలో చేస్తున్న షూటింగ్ లో బన్నీ వైవిధ్యభరితమైన లుక్ లో కనిపిస్తున్నాడు. కనుక ఆ లుక్ ను బయటకు రాకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ లుక్ కు సంబంధించిన ఫొటోలు వీడియోలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. షూటింగ్ సెట్ లో సిబ్బంది లేదా చూడ్డానికి వచ్చిన స్థానికిలు ఎవరైనా మొబైల్ ను ఉపయోగించి ఫొటోలు వీడియోలను చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తే వారి నుండి ఫోన్ లాగేసుకుని పగల గొట్టబడును అంటూ ప్లకార్డ్ లను అక్కడక్కడ పెట్టడం జరిగింది.


అల్లు అర్జున్ లుక్ తో పాటు టీజర్ పాట అన్ని విడుదల అయిన తర్వాత ఇంకా కూడా బన్నీ లుక్ ను బయటకు రానివ్వకుండా ప్రయత్నిస్తున్నారు అంటే బన్నీ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడు అనే టాక్ వినిపిస్తుంది. ఈ కొత్త లుక్ కు సంబంధించినంత వరకు ఎలాంటి అప్ డేట్ బయటకు ఇవ్వకుండా సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయాలని భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే డిసెంబర్ లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఇప్పటికే ప్రకటించారు. కనుక సినిమా విడుదల దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు. అతి త్వరలోనే సినిమా నుండి మరో పాటను కూడా విడుదల చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు
Recent Post