ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ సీజ‌న్-5 : ఈ వారం బెస్ట్ పర్ఫార్మర్ అతడే

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 03:23 PM



బిగ్ బాస్ సీజ‌న్-5 ప్రారంభమై రెండో వారం కూడా పూర్తికావోస్తోంది. రేపు ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జెస్సీ హౌజ్‌మేట్స్‌ని ఇమిటేట్ చేస్తూ శ్వేత‌ని న‌వ్వించాడు. అప్పుడు అక్కడ వాళ్లిద్దరూ తప్ప వేరే ఎవరూ లేరు. బిగ్ బాస్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్ర‌కారం స్క్రీన్‌ పై క‌నిపించిన పేరు ఉన్నవారు గార్డెన్ ఏరియాలో పై నుండి ప‌డుతున్న బంతుల్ని ప‌ట్టుకోవాలి. వాటిపై ఏ ఐట‌మ్ అయితే రాసి ఉంటుందో అది హౌజ్‌మేట్స్‌ కి ద‌క్కుతుంది. టాస్క్‌ స్టార్ట్‌ అవగానే ముందు విశ్వ పేరు వ‌చ్చింది. కాని అతడు బాల్ ను ప‌ట్టుకోలేక‌పోయాడు. లహరి, లోబో, సిరి కూడా మిస్ చేశారు. నటరాజ్‌ మాస్టర్‌, ప్రియాంక మాత్రం బాల్‌ క్యాచ్‌ చేసి ఇంట్లో వాళ్లకు ఫుడ్‌ దొరికేలా చేశారు. అనంత‌రం ఈ వారం హౌజ్ లో బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్‌ల పేర్లను ఏకాభిప్రాయంతో ఎంచుకోవాలని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చెప్పాడు. దీంతో ఎక్కువ ఓట్లు సాధించిన నటరాజ్‌ మాస్టర్‌ ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌గా ఎంపికయ్యాడు. ఎక్కువ మంది స‌న్నీని వ‌ర‌స్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా ఎంపిక చేయ‌డంతో అత‌న్ని జైలుకి పంపారు. గ‌త వారం జెస్సీ వ‌ర‌స్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా ఎంపికై జైలుకి వెళ్ల‌గా ఈ సారి స‌న్నీ వెళ్లాల్సి వ‌చ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com