ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ 'లైగర్' తో మెంటలే.. అంటున్న పూరీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 06:15 PM



టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగేసిన విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభం నుంచి ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ తో హాట్ టాపిక్ అవుతున్నారు.  ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్రశ్రేణి వ్యాపారం ప్రారంభించారు. అది పెద్ద సక్సెసైన సంగతి తెలిసిందే. ఇప్పుడు థియేటర్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ఇతర స్టార్ హీరోలను అనుసరిస్తున్నారు. రౌడీ విజయ్ దేవరకొండ థియేటర్ బిజినెస్ టాలీవుడ్ సర్కిల్స్ లో లేటెస్ట్ గా హాట్ టాపిక్.


అయితే లవ్ స్టోరి.. లైగర్ చిత్రాలతో ఏవీడీ థియేటర్స్ కి కావాల్సినంత ప్రచారం దక్కనుంది. ఇక #LIGER తో దేవరకొండ మెంటలెక్కించడం ఖాయమని పూరీ టాక్ గా  వినిపిస్తోంది. ఈ సినిమాలో దేవరకొండ నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా కనిపించనున్నాడు. ఇన్నేళ్లలో ఎందరో హీరోలను లుక్ పరంగా అమాంతం మార్చేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు లైగర్ చిత్రంతో దేవరకొండను కూడా అంతే గొప్పగా మార్చేశాడు. లైగర్ అన్న టైటిల్ కి తగ్గట్టే అతడిలోని క్రాస్ బ్రీడ్ ని లుక్ ని బయటపెడుతున్నాడు. కండలు మెలితిరిగిన దేహంతో పిలకముడితో విజయ్ దేవరకొండ కనిపిస్తున్న  తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవలే లీకైన ఓ ఫోటోగ్రాఫ్ వెబ్ లో దూసుకెళ్లింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com