ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సినిమా తోనే విజయ్ దేవరకొండ 'AVD థియేటర్' ఓపెనింగ్?

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 06:52 PM



హీరో విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లోని తన సొంత సినిమా థియేటర్ AVD సినిమాస్ ద్వారా ఎగ్జిబిటర్ గా మారనున్న విషయం తెలిసిందే. AVD సినిమాస్ ప్రారంభించడానికి ప్రముఖ మల్టీప్లెక్స్  డిస్ట్రిబ్యూషన్ చైన్ ఆసియన్ సినిమాస్ అధినేతలు నారంగ్స్ కుటుంబంతో విజయ్ చేతులు కలిపాడు.


తాజా సమాచారం మేరకు AVD సినిమాస్ సెప్టెంబర్ 24 న నాగ చైతన్య - సాయి పల్లవి లవ్ స్టోరీ స్క్రీనింగ్ తో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. విజయ్- నారంగ్ లు ఇటీవల AVD సినిమాస్ లో ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు పూర్తి చేశారు. దేవరకొండ తదుపరి చిత్రం లైగర్ కూడా అతని థియేటర్ లో ప్రదర్శితమవుతుంది.


ఏషియన్ సినిమాస్ ఇప్పటికే మహేష్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ ని ప్రారంభించింది. ఈ చైన్ లో ఏఎంబీ సినిమాస్ థియేటర్లను విస్తరిస్తారు. అలాగే అల్లు అర్జున్ తో ఏఏఏ థియేటర్స్ ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలో ఇప్పుడు మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలతో కలిసి ఏషియన్ సినిమాస్ థియేటర్ల రంగంలో దూసుకెళుతోంది.


టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగేసిన విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభం నుంచి ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ తో హాట్ టాపిక్ అవుతున్నారు.  ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్రశ్రేణి వ్యాపారం ప్రారంభించారు. అది పెద్ద సక్సెసైన సంగతి తెలిసిందే. ఇప్పుడు థియేటర్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ఇతర స్టార్ హీరోలను అనుసరిస్తున్నారు. రౌడీ విజయ్ దేవరకొండ థియేటర్ బిజినెస్ టాలీవుడ్ సర్కిల్స్ లో లేటెస్ట్ గా హాట్ టాపిక్.


టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ తో చేతులు కలిపిన దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మహేష్.. అల్లు అర్జున్... ప్రభాస్ బాటలోనే అతడు కూడా తెలివైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాడు.


ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఏషియన్ సినిమాస్ మూడు తెరల మల్టీప్లెక్స్ ను రౌడీ గారి స్వస్థలమైన మహబూబ్ నగర్ లో నిర్మించింది. ఇదివరకూ తిరుమల థియేటర్ ఈ ప్రాంగణంలో ఉండేది. అక్కడ  నిర్మాణం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ఈ కొత్త మల్టీప్లెక్స్కు AVD (ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ అని నామకరణం చేయడానికి కారణం ఏషియన్+ విజయ్ దేవరకొండ అనే అర్థం కోసమే. ఈ ఏడాది వేసవిలో వకీల్ సాబ్ సినిమా ప్రదర్శనతో ఏవీడీ సినిమాస్ ఘనమైన లాంచింగ్ కి రెడీ అవుతోందని ప్రచారమైనా అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు నాగచైతన్య లవ్ స్టోరీతో మొదలవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com