టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత ఇంట విషాదం చోటుచేసుకుంది. నందితా శ్వేత తండ్రి ఆదివారం కన్నుమూసారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన తండ్రి శివ స్వామి 54 ఏళ్ల వయస్సులో కన్నుమూసారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. తన శ్రేయోభిలాషులకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. నందిత తండ్రి ఇక లేరని తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కన్నడ సినిమా “నంద లవ్స్ నందిత” సినిమాతో నందిత తన నట జీవితాన్ని ప్రారంభించింది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా పలు భాషలలో నటిస్తోంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది.