పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆర్టిస్టు భాస్కర్ల వాసును చిత్ర పరిశ్రమ లెజెండ్, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తోపాటు ప్రముఖ నటులు అభినందించారు. హైదరాబాదులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వాసు మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రముఖుల చిత్రపటాలను తన కళా ప్రతిభతో తయారు చేసి బహుకరించారు. ఓదెలకు చెందిన వాసు ఆర్టిస్టు రంగంలో రాణిస్తూ పేరు ప్రఖ్యాతలు పొందుతున్నారు. దేశ రాష్ట్ర నాయకులతో పాటు ప్రముఖుల చిత్రాలను తన కళతో కళారూపాలను రూపొందిస్తున్న వాసు నైపుణ్యం పట్ల ఓదెల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.