ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే భీమ్లానాయక్ నుండి 'రానా' టీజర్.. డానియెల్ శేఖర్ గా రచ్చ

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 05:15 PM



పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. కొంతకాలం క్రితం మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. రానా కూడా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కు .. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.


ఈ  నేపథ్యంలో రానా పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ ఒక టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 6:30 ని: జూ  రానా టీజర్ విడుదలవుతుందని ఆ మూవీ టీం ప్రకటించింది.. ఈ టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ' అన్నారు కానీ ఎందుకో కుదరలేదని వినికిడి. సంక్రాంతి' పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com