ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలు నుంచి బయటకు వచ్చిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 05:00 PM



ముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా దాదాపు రెండు నెలల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాడు. నీలి చిత్రాల నిర్మాణం కేసులో అరెస్ట్ అయిన కుంద్రాకు నిన్న ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అన్ని ఫార్మాలిటీలు ముగిసిన తర్వాత కాసేపటి క్రితం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.


గత జులై 19న కుంద్రాతో పాటు ఆయన సహచరుడు ర్యాన్ థోర్పేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ పూర్తయి, ఛార్జిషీటు దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని శనివారంనాడు కోర్టును ఆయన కోరారు. ఈ కేసులో తనను బలిపశువును చేశారని, తప్పుగా తనను కేసులో ఇరికించారని, పోర్న్ చిత్రాల షూటింగులో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేకపోయినా తనపై ఛార్జిషీటు దాఖలు చేశారని బెయిల్ పిటిషన్ లో కుంద్రా పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com