ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బర్త్ డే గర్ల్ 'కృతి శెట్టి' స్పెషల్ పోస్టర్ల సందడి!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 05:53 PM



ఇప్పుడు టాలీవుడ్లో కృతి శెట్టికి ఉన్న క్రేజ్ .. ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే అందంతోను .. అభినయంతోను ఆమె కట్టి పడేసింది. ఈ మధ్య కాలంలో యూత్ ను ఇంతగా ప్రభావితం చేసిన కథానాయిక రాలేదు. ఇప్పుడు ఆమె కుర్రాళ్ల కలల దేవతగా మారిపోయింది .. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ రోజున కృతి శెట్టి పుట్టిన రోజు .. ఈ సందర్భంగా నాని జోడీగా ఆమె చేసిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత ఆమె సుధీర్ బాబు సరసన నాయికగా, ఇంద్రగంటి దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చేస్తోంది. ఈ సినిమా టీమ్ కూడా ఆమెకి బర్త్ డే విషెస్ తెలియజేసింది.


ఇక రామ్ జోడీగా కృతి శెట్టి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి కూడా కృతి శెట్టి బర్త్ డే పోస్టర్ వదిలారు. మొత్తానికి ఈ రోజంతా కృతి శెట్టి పోస్టర్లతో సోషల్ మీడియా వేడెక్కిపోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com