ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తికేయ 'రాజా విక్రమార్క' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 09:12 PM



కార్తికేయ కథానాయకుడిగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో 'రాజా విక్రమార్క'  సినిమా రూపొందింది. 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన తాన్య రవిచంద్రన్ మెరవనుంది. ఈ రోజున కార్తికేయ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా లిరికల్ వీడియోను వదిలారు.


'రాజాగారు బయటికొస్తే ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే, రాజాగారు బయటికొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే ' అంటూ ఈ పాట సాగుతోంది. కార్తికేయ ఈ సినిమాలో NIA ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అందువలన అందుకు సంబంధించిన యాక్షన్ స్టిల్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు... ప్రశాంత్ విహారి సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. డేవిడ్ సైమన్ ఆలాపన ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో కూడా కార్తికేయ శత్రువులను వెంటాడుతున్నప్పుడు .. వేటాడుతున్నప్పుడు ఈ సాంగ్ ప్లే అవుతుందనే అనుకోవాలి. ఆ తరహాలోనే దీనిని కంపోజ్ చేశారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న కార్తికేయకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com