ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లవ్ స్టోరీ'కి సూపర్ స్టార్ సపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 22, 2021, 09:53 AM



సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై ఆసక్తికి క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్‌గా విడుదలైన లవ్ స్టోరీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరూ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కింది. ఈ సినిమానుంచి విడుదలైన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సారంగదరియా పాట ఒక ఊపుఊపేసింది.


ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ అందించారు. మహేష్ సోషల్ మీడియా వేదికగా లవ్ స్టోరీ సినిమా పై ప్రసంశలు కురిపించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తన ట్విట్టర్ లో షేర్ చేశారు మహేష్. అలాగే 'డ్యాన్స్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. తెలుగులో ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంటాయి. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడటానికి నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. 'లవ్ స్టోరీ' టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్' అని పేర్కొన్నారు మహేష్. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు. రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని - ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com