ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుదేవా సంచలన నిర్ణయం...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 22, 2021, 01:15 PM



ప్రభుదేవా తన తండ్రి సుందరం మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పని చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘అగ్ని నక్షత్రం’ సినిమాలో రాజా రాజాధి రాజా అంటూ ఈయన కంపోజ్ చేసిన పాట అప్పట్లో పెద్ద సంచనలనం. ఈ సినిమాను తెలుగులో ‘ఘర్షణ’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెంటిల్మెన్’ సినిమాలో చికు బుకు చికు బుకు రైలే అంటూ హీరోయిన్‌ గౌతమితో కలిసి ప్రభుదేవా డాన్స్ మూమెంట్స్ అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ తర్వాత నటుడిగా పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు ప్రభుదేవా కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. తెలుగుతో పాటు హిందీతో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించిన హీరోగా సత్తా చాటారు. నటుడిగా ఓ వైపు నటిస్తూనే తెలుగులో ‘నువ్వు వస్తానంటే నేనొద్దాంటానా’ సినిమాతో డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ సినిమా బంపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్యార్ కియాతో డర్నా కా’ సినిమాకు రీమేక్ అనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్‌తో ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన ‘పౌర్ణమి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాను తమిళంలో ‘పొక్కిరి’ గా విజయ్, అసిన్‌లతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత ఇదే సినిమాను సల్మాన్ ఖాన్‌తో బాలీవుడ్‌లో ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసి ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్‌ను విజయ తీరాలకు చేర్చారు. రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ హీరోగా ‘రాధే’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలవడంతో పాటు సల్మాన్‌తో పాటు దర్శకుడిగా ప్రభుదేవాను విమర్శల పాలు చేసింది. అంతకు ముందు సల్మాన్ ఖాన్ తో చేసిన ‘దబాంగ్ 3’ కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దర్శకుడిగా వరుస ఫ్లాపులతో పాటు.. నటుడిగా అవకాశాలు రావడంతో ప్రభుదేవా ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో ప్రభుదేవా ‘భగీరా’ అనే సినిమాతో పలకరించనున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com