బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య” . ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మరి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మెగా మల్టీ స్టారర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. మరి ఇప్పుడు ఈ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఓ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. మరి అలాగే ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.. మరి ఇది రెండో సాంగ్ నా లేక మళ్లీ ఇంకోటి బ్యాలన్స్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..