ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 23, 2021, 10:04 AM



సినిమా ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా మాయమైన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.. అయితే ఈ అమ్మడు మాత్రం అలా అవ్వకూడదని తెగ ప్రయత్నిస్తుంది. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది రెజీనా కాసాండ్రా. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. త్వరలోనే ఈ బ్యూటీ నేనేనా అనే హారర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఓ క్రేజీ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. బాలీవుడ్‌లో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లో ఓ హీరోయిన్‌గా రెజీనా కాసాండ్రాను ఎంపిక చేశారని తెలుస్తుంది. రాజ్ – డీకే లు వరుసగా బాలీవుడ్‌లో సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.


 


ఈ క్రమంలో త్వరలో ఈ ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో హీరోగా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అమోల్ పాలేకర్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ వెబ్ సిరీస్ రెజీనా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న రెజీనా ఈ వెబ్ సిరీస్‌లో నటించడం వల్ల ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రాశిఖన్నా హీరోయిన్‌గా ఎంపిక అయిన విషయం తెలిసిందే.. రాజ్ -డీకేలు రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజన్ లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఈ ఇద్దరూ చేస్తున్న వెబ్ సిరీస్ పై అంచనాలు ఏర్పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com