నెట్ ఫ్లిక్స్ కి “శ్యామ్ సింగరాయ్” డిజిటల్ రైట్స్ ....!

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 12:00 PM

రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ సినిమాలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మంచి అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ముగిసినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ చిత్రం ను థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల లో విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జంగ సత్యదేవ్ కథ అందిస్తున్నారు.
Recent Post