"మా" ఎన్నికలలో మంచు విష్ణు టీమ్ ఇదే

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 12:22 PM

మా.. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకీ ఉత్కంఠ పెరిగిపోతోంది. అక్టోబర్‌ 10వ తేదీన మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్‌ తన ప్యానల్‌ను ప్రకటించగా. తాజాగా అధ్యక్ష రేస్‌లో ఉన్న మంచు వారబ్బాయి విష్ణు కూడా దూకుడు పెంచారు. ఈ క్రమంలో తన ప్యానల్‌ను ప్రకటించారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న మంచు విష్ణు 25 మందితో తన ప్యానల్‌ ప్రకటించారు. జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు పోటీ చేస్తారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, పృధ్వీరాజ్‌ బరిలో నిలుస్తున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్‌ పోటీ ఉన్నారు. ట్రెజరర్‌గా శివబాలాజీ, జాయింట్‌ సెక్రటరీగా కరాటే కల్యాణి, గౌతమ్‌రాజు పోటీ చేస్తున్నారు.
Recent Post