ఆ హీరో చనిపోయాడంటూ యూట్యూబ్ వీడియో

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 12:53 PM

ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ తో రామచంద్ర పాత్రలో మంచి అభిమానం సంపాదించుకున్న హీరో అమర్ దీప్. ఈ సీరియల్ కంటే ముందు ఉయ్యాల జంపాల, సిరిసిరిమువ్వలు వంటి పలు సీరియల్స్ లలో నటించాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు. ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు. ఇదిలా ఉంటే ఈయనను ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ బతికుండగానే చంపేసింది. ఇటీవలే మిధున్ టాకీస్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం కక్కుర్తితో బాగా దిగజారింది. ఇందులో దారుణంగా కన్నుమూసిన సీరియల్ నటుడు అమర్ దీప్ అంటూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఆయన ఫోటోతో పాటు.. హాస్పిటల్ లో ఉన్న మరో ఫేక్ ఫోటోని యాడ్ ను తంబ్ నెయిల్ పెట్టి మరీ వీడియోను అప్ లోడ్ చేశారు ఆ ఛానల్ వాళ్లు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారగా నెటిజన్లు చూసి షాక్ అయ్యారు. దీంతో ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన ఈ ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు సెలబ్రెటీలు గట్టిగా స్పందించారు. ఇక మరో బుల్లితెర నటి అషు రెడ్డి కూడా తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆ యూట్యూబ్ ఛానల్ పై ఫైర్ అయ్యింది. అంతేకాకుండా ఆ వీడియో స్క్రీన్ షాట్ లు తీసి ఈ ఛానల్ పై రిపోర్ట్ చేయాలి అంటూ బాగా ఫైర్ అయ్యింది.
Recent Post