'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్!

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 01:52 PM

రాజ్ తరుణ్ హీరోగా 'అనుభవించు రాజా' సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ .. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి చరణ్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. భీమవరంలో జరిగే కోడి పందాలతో ఈ టీజర్ మొదలవుతోంది. ఒక వైపున కోడి పందాలు .. మరో వైపున పేకాట .. ఇంకో వైపున మందు .. మగువ అన్నట్టుగా జల్సా పురుషుడిగా రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. వంటినిండా బంగారంతో కనిపిస్తున్న రాజ్ తరుణ్ పాత్ర పేరు కూడా బంగారమే అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఊళ్లో బంగారం .. బరిలో ఆయన కోడి పుంజు ఉండగా ఇంకెవరూ గెలవలేరు అనే టాక్ ఉన్నట్టుగా చూపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజ్ తరుణ్ డిఫరెంట్ లుక్ తో కొత్తగానే ట్రై చేశాడని అనిపిస్తోంది. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాతో, ఆయన కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూడాలి.
Recent Post