‘లవ్ స్టోరీ’ కి సాలిడ్ బుకింగ్స్ ...!

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 03:23 PM

శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ల‌వ్ స్టోరీ". ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.  ట్రైలర్‌లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం మొదటి నుంచి కూడా ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఉంది. మధ్యలో పలు అవాంతరాలు వచ్చినా సినిమా పూర్తయ్యి అలా వాయిదా పడుతూ ఉన్నా కూడా థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం ఆడియెన్స్ ఎక్కడా తగ్గలేదు. అందుకే ఇప్పుడు సరైన సమయం అని మేకర్స్ రిలీజ్ కి రెడీ చేశారు. మరి సరికొత్త రిలీజ్ డేట్ ఇచ్చి బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ప్రతీ చోట కూడా సాలిడ్ బుకింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో అయితే లవ్ స్టోరీ ప్రీమియర్స్ తోనే మంచి ఓపెనింగ్స్ అందుకునేలా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ రెండు లక్షల డాలర్స్ మార్క్ ను కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి లవ్ స్టోరీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి కాంబో నుంచి రేపు ఎలాంటి మ్యాజిక్ జరగనుందో వేచి చూడాలి.
Recent Post