మెగాస్టార్ “ఆచార్య” రీలీజ్ డేట్ ఎప్పుడో...?

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 04:05 PM

బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య” . ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మరి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మెగా మల్టీ స్టారర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఉంటుంది అని ఊహాగానాలు ఉన్నాయి కానీ ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి రేస్ కి సాధ్యమైనంత వరకు వచ్చే అవకాశం ఉందని టాక్. మరి ఇదెంత వరకు వాస్తవరూపం దాలుస్తుందో చూడాలి.
Recent Post