నటి నియా శర్మ సంచలన కామెంట్స్?

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 05:55 PM

పాపులర్ యాక్ట్రెస్ నియా శర్మ బాలీవుడ్ స్టార్ కిడ్స్‌పై నెగెటివ్ కామెంట్స్ చేసింది. తల్లిదండ్రుల పేర్లు చెప్పకుండా ఉంటే వారిని రెండోసారి ఎవరైనా చూస్తారా? అని విమర్శించింది. తను బాలీవుడ్‌లో ఎంటర్ అయ్యేందుకు సిద్ధంగా లేనని కొందరు అనవసర సలహాలు ఇస్తున్నారని తెలిపింది. తను అందంగా లేనని, సరైన బాడీ షేప్ లేదని అంటుంటారని వివరించింది. అలాంటి వారు ఒకసారి స్టార్ కిడ్స్ ఫేస్‌లు చూసి మాట్లాడితే బాగుంటుందని తెలిపింది.


వారిని నిజంగా చూడగలరా అని ప్రశ్నించిన నియా శర్మ.. వారి ముందు తను హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని అభిప్రాయపడింది. స్టార్ కిడ్స్ పెద్ద సినిమాలు చేస్తున్నారు కానీ అవుట్‌సైడ్ పీపుల్ అయితే వారికంత సీన్ ఉండేది కాదని చెప్పింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'మణికర్ణిక' సినిమాలో స్మాల్ రోల్ చేసిన ఆమెను ఎక్స్‌పీరియన్స్ అండ్ క్యారెక్టర్ గురించి ప్రశ్నించగా.. దాని గురించి మాట్లాడటం తెలివి తక్కువ అవుతుందని చెప్పింది.
Recent Post