మంచు విష్ణు ప్యానెల్ పై నరేశ్ స్పందన

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 07:27 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు ఈరోజు తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. మా కోసం మనమందరం పేరుతో ప్యానల్ సభ్యుల పేర్లను విడుదల చేశారు. ఈ ప్యానల్ లో విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేయనుండగా మాదాల రవి, పృథ్వి వైస్ ప్రెసిడెంట్లుగా పోటీ చేస్తున్నారు. రఘుబాబు జనరల్ సెక్రటరీగా, బాబూమోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ పడుతున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నారు.


మరోవైపు విష్ణు ప్యానల్ పై నరేశ్ స్పందించారు. విష్ణు ప్యానల్ చాలా బాగుందని నరేశ్ ప్రశంసించారు. ప్యానల్ సభ్యులెవరికీ ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. అన్ని ప్రాంతాల వారికి ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. అందరూ చదువుకున్నవారేనని చెప్పారు. యువకులు, అనుభవజ్ఞులను ఎంపిక చేశారని చెప్పారు. మహిళలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. విష్ణు విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
Recent Post