ఆకట్టుకుంటున్నశర్వా 'మహాసముద్రం' ట్రైలర్!

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 07:57 PM

శర్వానంద్ - సిద్ధార్థ్ ప్రధాన పాత్రధారులుగా అజయ్ భూపతి 'మహాసముద్రం' సినిమాను రూపొందించాడు. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమాలో, కథానాయికలుగా అదితీ రావు - అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. ఈ సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ ను వదులుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.


లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "నువ్వు సముద్రం లాంటివాడివి అర్జున్ .. నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయ్" అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.  


ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. రావు రమేశ్ .. 'గరుడ' రామ్ .. శరణ్య కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. కొంతకాలంగా శర్వానంద్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఆశిస్తున్న సక్సెస్ ఈ సినిమాతో లభిస్తుందేమో చూడాలి. 
Recent Post