ఆ హీరోయిన్ ను అరెస్ట్ చేయవద్దు: సుప్రీంకోర్టు

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 23, 2021, 10:06 PM

ముంబైలో వెలుగుచూసిన పోర్నో గ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో హీరోయిన్ గెహనా వశిష్ట్ కు భారీ ఊరట లభించింది. బాలీవుడ్ ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో సత్సంబంధాలు కలిగి ఉండడం.. అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలు గెహానాపై వచ్చాయి. ఈమెను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.133 రోజులుగా కస్టడీలో ఉన్న ఆమెకు ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


పోర్నగ్రఫీ కేసులో నటి గెహానా వశిష్ట్ ను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. ఆమెపై ఒకే తరహా కేసులు మూడు నమోదయ్యాయని.. కొద్దిరోజులు జైల్లో ఉన్నారని ఆమె తరుఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో దర్యాప్తునకు సహకరించాలని షరతు విధిస్తూ గెహానాను అరెస్ట్ చేయవద్దని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.


సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ పై నటి గెహనా ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. ‘సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ నాకు మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను చెప్తున్నా.. నన్ను నమ్మండి.. నన్ను ఎవరూ తప్పుదోవ పట్టించలేదు. డబ్బుల కోసం ఎవరిని మోసం చేయలేదు. కావాలనే నన్ను కొందరు ఈ కేసులో ఇరికించారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


గతంలోనే ముంబై హైకోర్టులో గెహానా బెయిల్ పై దరఖాస్తు చేసుకుంది. కోర్టు దాన్ని తిరస్కరించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పిటీషనర్ ను అరెస్ట్ చేయరాదని.. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆమెను ఆదేశించింది.


ఇక పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు సోమవారం బెయిల్ లభించింది. ఆయన విడుదలయ్యాడు. దీంతో ఈ కేసులో మిగతా వారికి ఊరటనిచ్చేలా కోర్టు తీర్పునిచ్చింది.
Recent Post