ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమోషనల్ అయిన సిరి

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 24, 2021, 10:37 AM



బిగ్ బాస్ హౌస్‌లో లవ్ స్టోరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అబ్బాయిలంతా అమ్మాయిలను ఇంప్రస్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో ఉన్న వాళ్ళు తమ లవ్ స్టోరీస్ చెప్పుకొచ్చారు. ఒకొక్కరు తమ ప్రేమ గాధలను తెలిపారు. ఈ క్రమంలో సిరి చెప్పిన తన ప్రేమ కథ అందరిని ఆకట్టుకుంది. పదవ తరగతిలో ప్రేమించి అబ్బాయితో వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది సిరి. తన ప్రేమ కథను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. సిరి మాట్లాడుతూ.. నా ఫస్ట్ లవ్ పేరు విష్ణు.. అందరూ అతన్ని ముద్దుగా చిన్నా అంటారు.. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా. మా ఇంటి ఎదురింటిలోనే అతను ఉండేవాడు. ఓ రోజు అతను నాకు ప్రపోజ్ చేశాడు.. తనంటే నాకూ ఇష్టమే కావడంతో ఓకే చెప్పేశా.. అయితే తను చాలా పొసిసివ్.. ఎలాగంటే నేను కనీసం కాలేజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడు. ఈ విషయం పై మా మధ్య పెద్ద గొడవ కూడా అయ్యింది. ఆ టైమ్ లో నాకు పెళ్లి సంబంధం వచ్చింది.. అతని మీద కోపంతో నేను ఒప్పేసుకున్నాను. అయితే రేపు ఎంగేజ్‌మెంట్ అనగా తను నా దగ్గరకు వచ్చాడు. ఏడుస్తూ.. నా కాళ్లపై పడిపోయి నాకు నువ్ కావాలి.. నువ్ లేకుండా ఉండలేను. నేను తప్పు చేశా.. అంటూ ఏడ్చేశాడు.


నాకూ తనంటే చాలా ఇష్టం.. తనూ నాకు కావాలని.. తెల్లవారితే ఎంగేజ్ మెంట్ అనగా.. నేను రాత్రికి రాత్రి అతనితో పారిపోయా.. ఆ తరువాత మా అమ్మ నాతో మాట్లాడి వెనక్కి తీసుకుని వచ్చారు. కానీ మేం రిలేషన్ షిప్‌లోనే ఉన్నాము. ఆ రిలేషన్ షిప్ చాలా బాగుంది.. కొన్నాళ్లు అలాగే ఉన్నాం. మధ్యలో గొడవ కూడా అయ్యింది. ఓరోజు ఉదయాన్ని నాకు 3 గంటలకు మెలుకువ వచ్చేసింది. మళ్లీ పడుకున్నాను ఆ తర్వాత 8 గంటలకు లేచాను. అప్పుడే నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది.. విష్ణు చనిపోయాడు అని. నాకు ఎప్పుడైతే మెలుకువ వచ్చిందో ఉదయం 3 గంటలకు అప్పుడే తను యాక్సిడెంట్‌కి గురై చనిపోయినట్టు తెలిసింది. తన కోసం నేను ఎంతో చేశా.. కానీ తనని ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. తనని నేను మర్చిపోలేకపోతున్నా.. ఐ లవ్యూ విష్ణు' అంటూ కన్నీరు మున్నీరు అయ్యింది సిరి. దాంతో హౌస్ లో ఉన్నవాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com