'సర్కారు వారి పాట' నుంచి ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్?

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 01:01 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తిసురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‏లు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ మొదటి షెడ్యూల్ దుబాయ్‏లో.. గోవాలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.


సర్కారు వారి పాట మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మహేష్ న్యూస్ లుక్.. ఆయన పాత్ర గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇవే కాకుండా.. ఈ సినిమాకు మొదటి నుంచి లీకుల బాధ తప్పడం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు సీన్స్, మహేష్ న్యూలుక్ లీకైన సంగతి తెలిసిందే. దీనిపై చిత్రయూనిట్ సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే… ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుపుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ షూట్ కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో కీలక ప్రాజెక్ట్ నిమిత్తం చిత్రయూనిట్ మొత్తం స్పెయిన్ వెళ్లనున్నారట. దాదాపు మూడు వారాల పాటు అక్కడ షూట్ ఉండనుందని.. అంతేకాకుండా.. అక్కడ షూట్ కంప్లీట్ అయితే.. దాదాపు 70 నుంచి 80 శాతం చిత్రీకరణం పూర్తయినట్లేనట. దీంతో సినిమా శరవేగంగా పూర్తవుతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా.. జనవరి 13న విడుదల చేయనున్నారు
Recent Post